మహేష్ మల్టిప్లెక్స్ థియేటర్‌లో ‘అంతరిక్షం’ ఈవెంట్..

304

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో ఏఎంబీ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.మొన్ననే గ్రాండ్ గా సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీద ఓపెన్ అయ్యింది.అయితే ఈ థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు.ఇప్పటికే చాలా సినిమా ఈవెంట్స్ నిర్వహిస్తాం అని ముందుకు వస్తున్నారు.

Image result for anthariksham telugu movie

అయితే ఈ మల్టీప్లెక్స్‌లో తొలి ఈవెంట్‌ నిర్వహించుకోబోతున్న సినిమా అంతరిక్షం.ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్షం సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే.’9000 కెఎంపిహెచ్ అనేది ఉపశీర్షిక. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Related image

ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9 ఉదయం 11 గంటలకు చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్.