‘అంతరిక్షం’ మూవీ రివ్యూ వరుణ్ తేజ్ స్పేస్ థ్రిల్లర్ హిట్టా ఫట్టా

368

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం. ఒకే జోనర్ లో సినిమాలు చేయకుండా వరుణ్ వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటున్నాడు. ఘాజితో సరికొత్త అనుభూతిని అందించిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షం చిత్రంతో మరో ప్రయోగం చేస్తున్నాడు. ట్రైలర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచింది. టాలీవుడ్ లో వస్తున్న తొలి స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. లావణ్య త్రిపాఠి, అదితి రావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందామా.

Image result for అంతరిక్షం

ఫస్ట్ హాఫ్ లో అందరి పరిచయాలు చేసుకుని తరువాత వరుణ్ లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమకథ ఉంటుంది. ఆ తరువాత అంతరిక్షం మిషన్ వస్తుంది. అలా ప్రేమను దూరం పెట్టి అంతరిక్షానికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అతనికి తోడుగా అదితి రావు తోడుగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం అంతరిక్షంలోనే సినిమా ఉంటుంది. అక్కడకు వెళ్ళాకా వాళ్లకు టెక్నీకల్ సమస్యలు వస్తాయి. వాటిని వరుణ్ అదితి ఎలా ఎదుర్కొని మిషన్ ను సక్సెస్ చేశారనేదే సినిమా కథ. ట్రైలర్ అద్భుతంగా ఉండటం, అంతరిక్షాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంతో సినిమా అదిరిపోతుందని అంతా అనుకున్నారు.కానీ సినిమా అలా లేదు. అంతరిక్షం చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదు. కొన్ని సన్నివేశాలు మాత్రమే బావున్నాయి. ఎక్కువగా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ అంతలా ఎం లేదు.సెకండ్ హాఫ్ లో ఒక 15 మినిట్స్ చిత్రం చాలా బాగుంటుంది. మిగతా అంతా చాలా బోర్ కొడుతుంది. మ్యూజిక్ కూడా అస్సలు బాగాలేదు. స్పేస్ చిత్రం కాబట్టి మ్యూజిక్ కొట్టడానికి అంతలా ఏం లేదు.

 

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్లస్ పాయింట్స్ : స్టోరీ వరుణ్ అదితి నటన మిషన్ ఫెయిల్ అయినప్పుడు వచ్చే సీన్స్

మైనస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే దర్శకత్వం విజువల్ ఎఫెక్ట్స్

ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ : 2.5/ 5