మరో మెగా మేనల్లుడి ఎంట్రీకి రంగం సిద్దం..!

404

మరో మెగా మేనల్లుడి సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్దమయింది..ఇప్పటికే ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవడానికి రెడీ అయిపోయాడు..ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన మొదటి సినిమా విజేత విడుదలయి విజయం సాదించింది.. అలాగే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్‌ కూడా ఎప్పటి నుంచో హీరో అవ్వాలని అనుకుంటున్నాడు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం వైష్ణ‌వ్ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కతుంది.

‘నేల టిక్కెట్టు’ నిర్మాత రామ్ తాళ్లూరి వైష్ణ‌వ్‌ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ దర్శకుడు సాగర్‌ కె. చంద్రతో దర్శకత్వంలో వైష్ణ‌వ్‌ తేజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలోని కొంత భాగం షూట్ కూడా చేశారట. అయితే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైష్ణ‌వ్ సినిమా పూర్త‌య్యాక‌ సాయిధ‌ర‌మ్ తేజ్ తోనూ రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మించనున్నారు