క్యాన్స‌ర్ బారిన మ‌రో అగ్ర‌న‌టుడు శోక‌సంద్రంలో సినీ ప‌రిశ్ర‌మ

632

బాలీవుడ్ లో ఎవ‌రు పేరు వినిపించినా వినిపించ‌న‌క‌పోయినా క‌పూర్స్ ఫ్యామిలీ పేరు చిర‌స్దాయిలో నిలిచిపోతుంది అని చెప్పాలి.పృథ్విరాజ్‌ థియేటర్స్ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్‌కపూర్‌ది ఒక గొప్ప కళాకారుల ఖాందాన్ అనే చెప్పాలి. మూకీ యుగం నుంచి టాకీ యుగం దాకా నలభై ఏళ్లకు పైగా హిందీ చలనచిత్ర సీమకు మార్గదర్శిగా ఉంటూ, ఏకచత్రాధిపత్యం వహించిన చలనచిత్ర పితామహుడు ఆయన. ఆ ఒరవడిని పెద్దకుమారుడు రాజ్‌కపూర్‌ చేతబూని, ఆర్‌.కె.స్టూడియోస్‌ నిర్మించి గొప్పచిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడుగా రాణించి ‘ది గ్రేటెస్ట్‌ షో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీ’గా పేరుతెచ్చుకున్నాడు.

Image result for rishi kapoor

రాజ్‌కపూర్‌ తమ్ముళ్లు షమ్మికపూర్, శశికపూర్‌లు కూడా హిందీ చలనచిత్ర పరిశ్రమకు నటులుగా, చిత్ర సమర్పకులుగా బహుముఖ సేవలు అందించారు. పృథ్వీరాజ్‌ తనయులందరికీ ‘పద్మ’పురస్కారాలు లభించాయి. రాజ్‌కపూర్‌ తనయులు రణధీర్‌కపూర్, రిషికపూర్‌లు కూడా హిందీ చలనచిత్ర సీమకు మూడవ తరం వరంగా మారి మంచి నటులుగా, దర్శకులుగా కూడా రాణించారు. వారిలో రిషి కపూర్‌ది అద్వితీయ రికార్డు. నూట ముఫ్ఫై సినిమాలకు పైగా హీరోగా, క్యారక్టర్‌ నటుడుగా రాణిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించడమే కాకుండా, నాలుగోతరానికి రణబీర్‌ కపూర్‌ని ఒక మంచి హీరోగా తీర్చిదిద్ది కపూర్‌ వంశపాలనను కొనసాగిస్తున్నారు.

Image result for rishi kapoor

ఇక కొద్దిరోజులుగా రిషికపూర్ కు క్యాన్స‌ర్ సోకింది అని ఓ వార్త వినిపించింది. అందుకోసం ఆయ‌న చికిత్స కోసం అమెరికాకు వెళ్లడం జ‌రిగింది అని బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గత కొద్దిరోజులుగా రిషీ కపూర్‌ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారనే వార్త మీడియాలో బలంగా వినిపిస్తున్నది. న్యూ ఇయర్ సందర్భంగా రిషి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఆయన భార్య, నటి నీతూ కపూర్ చెప్పకనే చెప్పడం మరిన్నీ అనుమానాలకు బలం చేకూరింది.నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రిషి కపూర్, నీతూ కపూర్, రణ్‌బీర్ కపూర్, అలియాభట్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా కలుసుకొన్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకొన్నట్టు తెలియచేశారు. ఈ సందర్బంగా నీతూ కపూర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో కామెంట్ పెట్టారు.హ్యాప్పీ న్యూఇయర్ 2019. ఈ ఏడాది ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. కాలుష్యం, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలని కోరుకొంటున్నాను. ఇక క్యాన్సర్ (కర్కాటకం) అనేది జాతక చిహ్నం (జొడియాక్ సైన్)‌గానే మిగిలిపోవాలి. పేదవారిని చిన్నచూపు చూడకుండా, సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ సంతోషంగా ఉండాలి అని నీతూ పేర్కొన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రిషీ కపూర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు డైరెక్టుగా చెప్పకపోయినా నీతూ మాటలు పలు అనుమానాలకు బలం చేకూర్చాయి. అంతేకాకుండా అనారోగ్యానికి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టు ట్వీట్ చేయడంతో కొంత క్లారిటీ వచ్చేసింది.ఇటీవల మరణించిన తన తల్లి కృష్ణ‌రాజ్ కపూర్ అంత్యక్రియలకు రిషీ కపూర్ హాజరుకాకపోవడంపై బాలీవుడ్‌లో పెద్ద చర్చ జరిగింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నందుకే ఆయన రాలేదని వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. కానీ ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్ వార్తలను ఖండించాడు…ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగానే క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. ఇర్ఫాన్ ఖాన్, సొనాలి బింద్రే, నఫీసా అలీ లాంటి వారు వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా రిషీకపూర్‌కు కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారనే వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది.మ‌రి ఆయ‌న తొంద‌ర‌గా కోలుకోవాలి అని కోరుకుందాం.