అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్.. వెంకీ, వరుణ్, రవితేజ కలిపి ఎఫ్3

248

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలలో ఎఫ్2 చిత్రం బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. వెంకటేష్ చాలా కాలం తర్వాత ఫుల్ లెన్త్ కామిక్ రోల్ లో కనిపించాడు. వరుణ్ తేజ్ తెలంగాణ యాసలో మంచి నటన కనబరిచాడు. తమన్నా, మెహ్రీన్ గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ చిత్ర విజయాన్ని కారణమయ్యాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Image result for f2 movie

ఈ చిత్రానికి సీక్వెల్ ఉందంటూ వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.ఎఫ్3 ఉంటుందని దర్శకుడు అనిల్ ఇంతకముందే చెప్పాడు. ఈ నేపథ్యంలో ఎఫ్3 కోసం అనిల్ రావిపూడి భారీ ప్లానింగ్ నే సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎఫ్3 లో మాస్ మహారాజ రవితేజ కూడా ఉండబోతున్నాడట.

ముగ్గురితో కలసి

వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ముగ్గురితో అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రానికి కథ రెడీ చేస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఎఫ్3 లో మరింత ఫన్ ఉండేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.రవితేజ అనిల్ కాంబినేషన్ లో ఇప్పటికే రాజా ది గ్రేట్ చిత్రం వచ్చింది. మరి ఈ ఎఫ్3 ఎలా ఉండబోతుందో చూడాలి.