యాంకర్ సుమ సంచలన నిర్ణయం.. షాక్ లో Etv యాజమాన్యం

597

యాంక‌ర్ సుమ బుల్లితెర‌పై త‌న యాంక‌రింగ్ తో అశేష తెలుగు జ‌నాల ప్రేమ, ఆద‌రాభిమానాలు అందుకుంది… సుమ యాంక‌రింగ్ చేసింది అంటే టీవీ రిమోక్ట్ తీసుకుని ఛాన‌ల్ ఎవ‌రూ క‌ద‌ప‌రు.. ఆమె యాంక‌రింగ్ అంత పేరు గాంచింది.. ఇక ప‌లు టీవీషోలు అలాగే ఆడియో వేదిక‌లకు బిజీ బిజీగా యాంక‌రింగ్ చేస్తోంది సుమ‌…. ఇక యాంక‌ర్ సుమ తాజాగా ఓ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆ విష‌యం ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for anchor suma
యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న స్టార్ మహిళ కార్యక్రమం దశాబ్ద కాలంగా ప్రసారం అవుతూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. సుధీర్ఘ కాలం పాటు సాగిన ఈ షోకు త్వరలో ముగింపు పలకనున్నారు… ఈ విషయం బాధాకరమే అయినా చెప్పక తప్పడం లేదు అంటూ సుమ ఓ వీడియో పోస్టు చేశారు. ఈ షోను ఆపడం నాకు కూడా బాధగానే ఉందని చెబుతూనే, నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో కూడా చెప్పే ప్రయత్నం చేశారు.

Image result for anchor suma

ఏకదాటిగా 12 సంవత్సరాల నుండి ఈ లేడీస్ గేమ్ షో రన్ చేస్తున్నాం. ఇది వన్ అండ్ ఓన్లీ లేడీస్ గేమ్ షోగా ఇండియాలో పేరు తెచ్చుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అయితే వినూత్నమైన కార్యక్రమాలను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతానికి స్టార్ మహిళకు ఒక చిన్న ముగింపు పలుకుతున్నామని సుమ తెలిపారు…ఈ విషయం మీకు కొంచెం బాధ కలుగిస్తుందని తెలుసు, ఎందుకంటే స్టార్ మహిళ మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అవుతుంది. మీ పిల్లలకు అన్నం తినిపిస్తూ, లేదా మీరు భోజనం చేస్తూ సరదాగా చూస్తూ గడిపే టైం. ఈ కార్యక్రమంతో మీకు మంచి అనుబంధం ఏర్పడింది అని సుమ గుర్తు చేసుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం చూసే ఆమె అభిమానుల‌కు సుమ ఓ ఆఫ‌ర్ ఇచ్చారు… స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రేమించిన ప్రేక్షకులు, నేనంటే ఇష్టపడే ప్రేక్షకులు ఒక చిన్న వీడియోను, మీ ప్రేమను మాకు పంపించండి. బెస్ట్ వీడియోస్‌ను గ్రాండ్ ఫినాలెలో ప్రసారం చేయడం జరుగుతుంది…ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్లందరినీ నాకు చాలా దగ్గర చేసినటువంటి ఏకైక కార్యక్రమం స్టార్ మహిళ. నేనెప్పటికీ ఈ కార్యక్రమాన్ని నా గుండెల్లో దాంచుకుంటాను అని సుమ తెలిపారు. మ‌రి ఈ షోతోనే సుమ మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. అయితే టీఆర్పీల పోటీలో కొన్ని కార్య‌క్ర‌మాలు ఇలానే ముగుస్తాయ‌ని అంటున్నారు బుల్లితెర పెద్ద‌లు.. సుమ చెప్పిన వీడియోను పంపి ఆమెపై మీ అభిమానాన్ని, ఆ షో మీకు ఎంత ఇష్ట‌మో తెలియ‌చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.