యాంకర్ సుమ నిజ స్వరూపం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే

630

బుల్లితెర యాంకర్‌గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె టీవీ షో లేదా ఆడియో ఫంక్షన్ ఇలా ఎక్కడైనా సరే నవ్వులు పూయించే సరదా వ్యాఖ్యత … అయితే చేతినిండా సంపాద‌న ఉన్నా సాయం చేసే గుణం చాలా త‌క్కువ మందికి ఉంటుంది.. కాని సాయం చేసే గుణం ఉన్న‌వారిని చూస్తే మ‌రికొంద‌రిలో మార్పు వ‌స్తుంది అంటారు పెద్ద‌లు.. అయితే త‌న స‌ర‌దా షోల‌తో తెర‌పై న‌వ్వించే సుమ నిజ‌జీవితంలో కూడా ఆప‌ద‌లో ఉన్న‌వారికి సాయం చేసి, స‌మాజానికి త‌న వంతు కృషి చేస్తోంది.. ఆమెలో ద‌యాగుణం అనే మరో కోణం కూడా ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే చలించిపోతుంది. వారికి వెంటనే సాయం అందిస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇటీవల తిత్లీ తుఫాన్ దాటికి అల్లకల్లోలమైన శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు పడుతున్న కష్టాలకు చలించిపోయింది. ఈ సందర్భంగా కాలిగం గ్రామంలో ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డ వృద్ధ దంపతులకు ఆమె అండగా నిలిచారు. వారికి విరాళమిచ్చి వదిలేయకుండా, కూలిన ఇంటిని తిరిగి కట్టిస్తోంది. ఆ పనులను ఆమే దగ్గరుండి చూసుకుంటోంది. ఈ విషయాన్ని సుమ‌ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సుమ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ శ్రీకాకుళం వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు గురించి సుమకు చెప్పాడు. ఈ సందర్భంగా ఈ వృద్ధ దంపతుల కష్టాలను తెలుసుకున్న ఆమె.. వారికి ఇల్లు నిర్మించి సాయం చేయాలని నిర్ణయించింది.