యాంక‌ర్ సుమ ఇళ్లు ఎంత పెద్ద‌దో చూడండి ఈ ఇంట్లో ఐదు టాప్ సినిమా షూటింగ్ లు జ‌రిగాయి

3140

ఆమె మాట గ‌ళ‌గ‌ళ‌మ‌ని ఉంటుంది.. ఆమె మాట గంగాన‌ది ప్ర‌వాహం.. ఆన‌క‌ట్ట‌కు బ్రేకులు ఉంటాయి ఏమో కాని సుమ మాట‌ల‌కు బ్రేకులు ఉండ‌వు.. ఆలోచించుకోవ‌డానికి మ‌నకి స‌మ‌యం కావాలి ఏమో కాని, ఆమె మాట‌ల‌కు అడ్డు ఉండ‌దు.. అంత స్పీడుగా మాట్లాడుతుంది యాంక‌ర్ సుమ.. నిజంగా బుల్లితెర మ‌హారాణి అనే చెప్పాలి.. ఏ షో అయినా ఆ షోకు యాంక‌రింగ్ సుమ చేస్తే ఆ షోకి మ‌రింత అందం వ‌స్తుంది.. ఇక టాప్ షోలు అన్ని బుల్లితెర‌లో ఇప్పుడు చేస్తుంది యాంక‌ర్ సుమ‌నే.. బుల్లితెర టీఆర్పీలు యాంక‌ర్ సుమ హోస్ట్ చేసేషోల మీద ఆధార‌ప‌డి ఉంటాయి.

Image result for suma kanakala house

అయితే ఇటు సినిమాల్లో కూడా న‌టించినా ఆమెని బుల్లితెర‌లోనే చూడాలి అని అనుకుంటారు అంద‌రూ…నిజంగా చెప్పాలి అంటే ఆమె యాంక‌రింగ్ చూడ‌టానికి విన‌డానికి బాగుంటుంది.. ఇక అనేక షోలు ఉండ‌టంతో ఆమె కూడా సినిమాల‌ను ప‌క్క‌న పెట్టేశారు… 24 గంట‌ల్లో 13 గంట‌లు ఆమె షూటింగుల‌తో బిజీగా ఉంటారు అంటే నమ్మ‌వ‌ల‌సిందే.. కారులో కూడా ఆమె ఆడియో ఫంక్ష‌న్ల గురించి ప్రిపేర్ అవుతారు అది సుమ స్పెషాలిటి.ఇక రాజీవ్ క‌న‌కాల సినిమాల్లో బిజిగానే ఉన్నాడు.. ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ అటు షోలు చేస్తూ తెలుగులో టాప్ యాంక‌ర్ గా ఆమె కొన‌సాగుతున్నారు.. అయితే సుమ క‌న‌కాల ఫ్యామిలీ అంతా సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంతో కాలంగా పరిచ‌యం అయిన వారే.. ర‌జ‌నీకాంత్ చిరంంజీవి వంటి ప్ర‌ముఖ హీరోల‌కు ఆనాడు న‌ట‌న‌లో శిక్ష‌న ఇచ్చిన కుటుంబం క‌న‌కాలా ఫ్యామిలీది… ఇక సుమ షోల‌తో ఎంత‌ బిజీగా ఉన్నా ఆమె కుటుంబానికి కూడా అంతే విలువ ఇస్తారు.

Image may contain: 1 person, smiling, indoor

అయితే ఇండ‌స్ట్రీలో చాలా మంది రాజీవ్ కు స్నేహితులే.. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ కు రాజీవ్ మంచి మిత్రుడు.. ఇక సుమ రాజీవ్ క‌లిసి త‌న ఫేస్ బుక్ అకౌంట్లో వారి ఇంటికి సంబంధించి కొన్నిపిక్స్ పెట్టారు.. అవి చూసి చాలా బాగున్నాయి అని అనుకుంటున్నారు. ఆ ఇళ్ల‌ను చూసి ఇవి ఎక్క‌డో చూశాము అని కూడా అనుకుంటున్నారు కొంద‌రు.. అవును వారి ఇంట్లో అనేక సినిమాలు షూటింగ్ జ‌రుపుకున్నాయి.. ఓసారి ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

100 ప‌ర్సెంట్ ల‌వ్ చిత్రంలో నాగ‌చైత‌న్య ఇళ్లు సుమ‌గారిదే
బాద్ షాలో సుమ ఇంటినే కాజ‌ల్ ఇంటిగా చూపించారు
బ్రూస్ లీ సినిమాలో చ‌ర‌ణ్ ఇళ్లు కూడా సుమ క‌న‌కాల హౌస్
దూకుడులో మ‌హేష్ బాబు హౌస్ కూడా సుమ రాజీవ్ దే
పూల‌రంగ‌డులో విల‌న్ హౌస్ కూడా క‌న‌కాల ఫ్యామిలీదే

ఆమె పిక్స్ చూసి ఈ ఇళ్లు ఎక్క‌డో చూశాము అని అనుకుంటారు అలాగే ఈ హౌస్ లో ఈ సినిమా షూటింగ్ లు జ‌రిగాయి.. గుర్తు తెచ్చుకోండి ఓసారి సినిమా షూటింగ్ లు ఈ హోమ్ లో జ‌రిగిన‌వే…ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను మీ కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

జేసి పావులు క‌దుపుతున్నారు