ఇండియాలోనే సంచలన రికార్డు సృష్టించిన యాంకర్ సుమ ఏంటో తెలిస్తే షాక్

738

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే సుమ అని ఠక్కున చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత రెండు దశాబ్దాలుగా టెలివిజన్, సినిమా రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా మాటలతో అదరగొట్టేస్తుంటారు. తాజాగా ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది.స్టార్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే స్టార్ మహిళ కార్యక్రమానికి సుమ ఏకైక యాంకర్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమ యాంకరింగ్‌ ప్రతిభను గొప్పగా చెప్పుకొంటారు.

హ్యాట్సాఫ్ టు యాంకర్ సుమ

స్టార్ మహిళ కార్యక్రమం దేశంలోనే అతి సుదీర్ఘంగా సాగుతున్న కార్యక్రమంగా రికార్డుకెక్కింది. 2008 ఆగస్టు 9న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇది టెలివిజన్ రంగంలో ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.స్టార్ మహిళ కార్యక్రమం ప్రస్తుతం 3 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఒకే కార్యక్రమం ఇన్ని ఎపిసోడ్స్‌గా కొనసాగడం నిజంగా అభినందనీయం. ఈ షోకు మంచి రేటింగ్‌ రావడానికి సుమ యాంకరింగ్ కూడా ఓ ప్రత్యేక కారణంగా చెప్పుకొంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కేవలం స్టార్ టీవీలోనే కాకుండా ఇతర ఛానెల్లో సుమ నిర్వహించే షోలకు మంచి ప్రజాదరణ ఉంది. సినిమా ఫంక్షన్లలో చాలా వరకు సుమనే యాంకరింగ్ చేస్తూ కనిపిస్తుంటారు. ఇక ఇటీవలే సినీ, టెలివిజన్ నిర్మాణ రంగం వైపు కూడా దృష్టిపెట్టారు. ఇలాంటి ఘనతలు సాధిస్తున్న వెర్సటైల్ యాంకర్‌ సుమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.