ఇండియాలోనే రికార్డ్ క్రియేట్ చేసిన యాంకర్ సుమ

223

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే సుమ అని ఠక్కున చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత రెండు దశాబ్దాలుగా టెలివిజన్, సినిమా రంగంలో విశేషంగా రాణిస్తున్నారు.తన వాక్ చాతుర్యం ,సమయస్ఫూర్తి కామెడీ టైమింగ్ తో ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా మాటలతో అదరగొట్టేస్తుంటారు.

Related image

తాజాగా ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. స్టార్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే స్టార్ మహిళ కార్యక్రమం ఏకంగా 11 ఏళ్లుగా నడిచిన పోగ్రామ్ గా రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ కార్యక్రమానికి సుమ ఏకైక యాంకర్.

Image result for anchor suma star mahila

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమ యాంకరింగ్‌ ప్రతిభను గొప్పగా చెప్పుకొంటారు. స్టార్ మహిళ కార్యక్రమం ప్రస్తుతం 3 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఒకే కార్యక్రమం ఇన్ని ఎపిసోడ్స్‌గా కొనసాగడం నిజంగా అభినందనీయం.