నాకు శ్రీముఖి కి పిల్లలు కూడా పుట్టారు యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్

1167

తెలుగు టివి రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న యాంకర్ రవి ఒకరు..తన వాక్చతుర్యంతో ఎన్నో అవకాశాలు అందుకుంటున్న రవి మాటలు ఎంతో సరదాగా వినసొంపుగా ఉంటాయంటారు అమ్మాయిలు..సందర్భాన్ని బట్టి కరక్ట్ గా టైమింగ్ లో పంచ్ లు వేయడం రవి స్పెషాలిటీ..పాపులారిటీ తో పాటు పలు వివాదాలు కూడా రవిని నిత్యం చుట్టుముడుతున్నాయి..ఒకప్పుడు లాస్యా రవి సూపర్ జోడీ..ఏ షోలో చూసినా వీరిద్దరే.. అప్పట్లో వీరిద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చాయి..కానీ లాస్య వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోవడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది..తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్ళికి సంబందించిన వివాదాస్పద ప్రశ్నలకు తనదైన శైలిలో సమాదానాలు చెప్పారు..

Image result for sree mukhi and ravi

‘పటాస్’ కామెడీ షోతో యాంకర్ రవి, శ్రీముఖిలు బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల ఈ షో నుండి శ్రీముఖి తప్పుకుని బిగ్ బాస్ ద్వారా సిల్వర్ స్క్రీన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే.. పటాస్ షో నుండి శ్రీముఖి తప్పుకోవడం వెనుకు తెరవెనుక చాలానే జరిగిందని.. యాంకర్ రవితో శ్రీముఖి ఎఫైర్ నడిపిందని.. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందంటూ చాలా పుకార్లు షికారు చేశారు.

Image result for sree mukhi and ravi

అయితే ఈ పుకార్లపై స్పందించారు యాంకర్ రవి.. ఓ యూట్యూబ్ ఛానల్‌ ఇంటర్వ్యూకి వెళ్లిన రవికి శ్రీముఖితో ఎఫైర్ గురించి ప్రశ్నలు రావడంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘మీరు యాంకర్ శ్రీముఖితో డేటింగ్‌లో ఉన్నారట.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట.. నిజమేనా? అంటూ యాంకర్ ప్రశ్నలు అడగడంతో.. ‘హా!! అవునండీ మా ఇద్దరికీ పిల్లలు కూడా పుట్టేశారు. ఒక హాస్టల్‌లో ఉంటూ టెన్త్ చదువుతున్నాడు. మాట్లాడటానికి కాస్తైనా కామన్‌సెన్స్ ఉండాలి’ అంటూ ఘాటుగా స్పందించారు రవి. చాలా మంది వ్యూస్ కోసం ఏవేవో రాస్తున్నారు.. వీళ్లిద్దరూ లవర్స్‌నా? మొగుడు పెళ్లాలా? ఫ్రెండ్స్‌‌నా? కో యాంకర్స్‌నా? అంటూ పిట్టగోడ మీద కూర్చుని కబుర్లు మొదలుపెడతారు. అవే వార్తలుగా వస్తుంటాయి. చివరికి వాళ్లు ఎందుకు మాట్లాడుకున్నా.. ఏం మాట్లాడుతున్నా.. నా షో చూస్తున్నారు. నాకు అది చాలు.

ఈ క్రింది వీడియో ని చూడండి

మిగతావి అవసరం లేదు. నాకు రేటింగ్ ఇస్తే చాలు. వాళ్లు అలా ఆలోచిస్తున్నారు కాబట్టే నేను కెలుకుతా ఉంటా.. వాళ్లు రావాలి చూడాలి. నేను చేసే షోలు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడలేరనేది వాస్తవం కాదు. నా లాగ నేను ఉంటా.. మీలాగ మీరు ఉండండి.. నన్ను ఉపయోగించుకుని డబ్బులు చేసుకుంటున్నారు కదా.. చేసుకోండి. మొత్తానికి నన్ను ఫేమస్ చేస్తున్నారు కదా.. జనాలను మాత్రం ఎర్రోళ్లను చేయకండి’ అంటూ ఆర్జీవీ స్టైల్‌లో రెచ్చిపోయారు యాంకర్ రవి. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..