మగాళ్ళ ను అలా చూస్తే నా మూడ్ పోతుంది షాకింగ్ కామెంట్స్ చేసిన రేష్మి

279

ఈమధ్యకాలంలో మహిళల వస్త్రధారణపై ప్రముఖులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మగాళ్ల వస్త్రధారణపై యాంకర్ రష్మి ఓ నెటిజన్‌కు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. తాజాగా నిర్మాతలు, డైరెక్టర్‌లను ఆకట్టుకుని సినీ ఆఫర్లను చేజిక్కించుకోవడానికే హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఈవెంట్‌లకు వస్తారని ఎస్పీ బాలసుబ్రమణ్యం కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

 

ఈయనతో పాటుగా చాలామంది ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మెగా బ్రదర్ మహిళలకు అనుకూలంగా నిలవడంతో పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఏ విషయమైనా ఎంతో బోల్డ్‌గా హ్యాండిల్ చేసే రష్మి మహిళల వస్త్రధారణపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చాలా ధీటైన సమాధానం ఇచ్చింది.
Rashmi
“మగవాళ్లు షార్ట్స్ వేసుకుంటున్నారు, వారి కాళ్లపై జుట్టు అలాగే అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది.. జబ్బలు కనిపించేలా కట్ బనియన్లు వేసుకుంటున్నారు. మరికొంత మంది షర్ట్ వేసుకోకుండా ఛాతి కనిపించేలా ఎక్స్‌పోజ్ చేస్తున్నారు.. ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి” అని బదులిచ్చింది ఈ అమ్మడు.