ఎఫ్2 లో ఇద్దరు హీరోల సరసన హాట్ హాట్ గా చిందేయ్యబోతున్న అనసూయ..

278

యాంకర్ అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ సెలెబ్రిటీ. ఇటీవల అనసూయ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.బుల్లితెరపై యాంకర్ గా, వెండి తెరపై నటిగా దూసుకుపోతోంది. అనసూయకు తన గ్లామర్ పెద్ద ప్లస్.సోగ్గాడే చిన్నినాయనా, క్షణం,విన్నర్, రంగస్థలం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అనసూయ నటించింది. ఇక రంగస్థలం చిత్రంలో రంగమత్తగా అద్భుత నటన కనబరిచింది. దీనితో అనసూయని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు దర్శక, నిర్మాతలు ఎగబడుతున్నారు.

ఇద్దరు స్టార్ హీరోల సరసన

ఇప్పటికే పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్న అనసూయ గురించి మరో క్రేజీ న్యూస్ వచ్చింది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. మిల్కి బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అనిల్ రావిపూడి దర్శకుడు.దిల్ రాజు నిర్మాత.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇద్దరు హీరోయిన్లు

ఈ చిత్రంలో జానపద నేపథ్యంలో సాగే ఐటమ్ సాంగ్ కోసం అనసూయని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్, వెంకీ ఇద్దరి మధ్య అనసూయ స్టెప్పులేయబోతోంది. ఈ స్పెషల్ సాంగ్ కు అనసూయ ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఎఫ్2 చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది.