వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’లో తన లుక్ ను విడుదల చేసిన అనసూయ..చీర కట్టులో…

598

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘యాత్ర’ అనే టైటిల్ మీద ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్రను చేస్తున్నాడు.మహి వి. రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను అనసూయ, పోసాని, వినోద్ కుమార్, సచిన్ ఖేడేకర్ పోషిస్తున్నారు.70ఎంఎం పిక్చర్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు.

పాదయాత్రలో భాగమైన అందరూ

అయితే ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపే ఒక ఫోటోను అనసూయ విడుదల చేసింది.అయితే ఈ ఫోటో ఆమె మొహం కనిపించకుండా కేవలం వెనక వైపు నుంచి మాత్రమే కనిపిస్తోంది. ఆమె ఇందులో ఎవరి పాత్ర పోషిస్తున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది.కర్నూలు జిల్లాకు చెందిన పవర్ ఫుల్ మహిళా నేత పాత్రలో అనసూయ నటిస్తోందని సమాచారం. కర్నాలు జిల్లాలోని సదరు ముఖ్య నేత తరహాలోనే అనసూయ చీరకట్టులో ఉండటంతో మరింత క్లారిటీ వచ్చినట్లయింది.

కర్నూలు రాజకీయ నాయకురాలు, చీరకట్టు అలానే ఉంది...

అయితే అనసూయ ఇందులో జర్నలిస్టులో కనిపించనుందనే మరో ప్రచారం కూడా ఉంది. అయితే చిత్ర యూనిట్ నుంచి కానీ, అనసూయ నుంచి ఈ పాత్రపై అఫీషియల్ స్టేట్మెంట్ ఏమీ లేదు.చూడాలి మరి అనసూయ ఎలాంటి పాత్రలో నటిస్తుందో.