బిగ్ బాస్ లో అన‌సూయ‌న‌కు షాక్ ఇచ్చిన కంటెస్టెంట్స్

443

బిగ్ బాస్ టాస్క్ ల మ‌జా మ‌రింత పెంచారు.. ఇప్ప‌టికే నామినేష‌న్ వ్య‌వ‌హారం ఎలా ఉన్నా బిగ్ బాస్ టాస్క్ లు కాస్త డిఫ‌రెంట్ గా ట్రై చేయాలి అని అనుకున్నారు.. అందుకే ఈసారి పెళ్లి అనే టాస్క్ ని ఇచ్చారు….బిగ్ బాస్ ఇల్లు పెళ్లి ఇల్లుగా మారింది. రాధాక్రిష్ణ, మధులత వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్…. రెండు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలో మెహిందీ, పెళ్లి, సంగీత్ ఇలా సంపూర్ణ పెళ్లి వేడుకకు బిగ్ బాస్ హౌస్ ముస్తాబు అయ్యింది.Image result for big boss house lo anusuya

ఈ పెళ్లి తంతు టాస్క్‌కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బంధువులు, స్నేహితులు ఇలా రెండు టీంలుగా విడిపోయి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రాధాక్రిష్ణ, మధులతల బొమ్మల పెళ్లి వేడుకకు పంతులుగా గణేష్ వ్యవహరించారు. ఈ పెళ్లి టాస్క్‌లో భాగంగా.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల మధ్య వెరైటీ టాస్క్‌లు జరిగాయి.ముందు స్మిమ్మింగ్ ఫూల్‌లో ఉంచిన ఉంగరాలను వెతికిపట్టుకునే టాస్క్ ఇవ్వగా.. దీప్తి నల్లమోతు, సామ్రాట్‌లు స్మిమ్మింగ్ ఫూల్‌లో తలపడ్డారు. ఇక హౌస్‌లో దాచి ఉంచిన చెప్పుల జతలను వెతికి పట్టుకునేందుకు పెళ్లికూతురు తరుపున అమిత్, గీతా మాధురి, తనీష్, గణేష్, పూజాలు కష్టపడి 20 జతల చెప్పులకు పట్టుకున్నారు. బహుమతులు గెలుచుకునేందుకు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు లడ్డూలను చుట్టడం, పెళ్లి కుమారులకు దుపట్టాలను అలంకరించడం లాంటి సరదా టాస్క్‌లను ఇచ్చారు. ఈ సరదా సరదా టాస్క్‌లు జరుగుతుండగానే వివాహ వేడుకకు పెళ్లి పెద్దగా ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ రంగమ్మత్త అనసూయ.

Image result for big boss house lo anusuyaరారండోయ్ వేడుక చూద్దాం.. అంటూ పెళ్లి వేడుక సాంగ్‌తో పళ్లెం పట్టుకుని బిగ్ బాస్‌ హౌస్‌లో రెండు టీంల మధ్య జరుగుతున్న రాధాక్రిష్ణ, మధులతల బొమ్మల పెళ్లిలో రంగమ్మత్త స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. వేడుకకు విచ్చేసిన రంగమ్మత్తకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు కంటెస్టెంట్స్. బుల్లి తెరపై తనదైలి అంద చందాలతో ఆకట్టుకునే రంగమ్మత్త బిగ్ బాస్ హౌస్‌లో జరిగే పెళ్లి వేడుక కోసం ప్రత్యేకంగా తయారై వచ్చింది. చీరతో సింగారించుకుని అందచందాలతో ఆకట్టుకుంది. ఇక పెళ్లికి వచ్చిన అనసూయను మీరు పెళ్లి తరుపున ఉంటారా? పెళ్లి కొడుకు తరపున ఉంటారా అనడంతో తనకి ఇద్దరు కొడుకులు ఉండటంతో పెళ్లి కూతురు తరుపునే ఉంటానని చెప్పింది…

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పెళ్లి సంగీత్‌తో అనసూయ అత్త పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.. ఇక అన‌సూయ వ‌స్తుంది అని అనుకోలేదు ఎవరో సెల‌బ్రెటీ వ‌స్తుంది అని అనుకున్నారు కంటెస్టెంట్స్.. అయితే అన‌సూయ‌ను చూడ‌గానే కౌశ‌ల్ ముందు ప‌ల‌క‌రించ‌గా మిగిలిన వారు అంత రెస్పాండ్ అవ్వ‌లేదు అని ట్రోల్ కూడా మొద‌లైంది.. ఇక వారి హావాభావాలు చూసి అన‌సూయ‌కూడా అంత రెస్పాండ్ అవ్వ‌న‌ట్టే క‌నిపించింది.. ఎవ‌రైనా అతిధులు వ‌స్తున్నారు అని అనుకుంటే ఎంతో సంద‌డిగా ఉండేవారు… ఇలా సంద‌డి స‌మ‌యంలో అన‌సూయ రావ‌డంతో కాస్త ఆశ్చ‌ర్య‌పోయి ఉంటారు అని కొంద‌రు అంటున్నారు ..మ‌రి నేటి ఎపిసోడ్ లో అన‌సూయ ఏం చేస్తుందో చూడాలి.