మహానటి సావిత్రి పాత్రలో అనసూయ…నెటిజన్స్ ఎలా ట్రోల్ చేస్తున్నారో చూస్తే నవ్వలేక చస్తారు..

287

అనసూయ తాజాగా ఓ కమర్షియల్ యాడ్లో నటించింది. మాయాజబార్ మూవీలోని ‘అహనా పెళ్లంట’ థీమ్‌తో ఈ యాడ్ డిజైన్ చేశారు. సావిత్రి తరహాలో అనసూయ డాస్స్ చేస్తూ, ఆవిడలా హావ భావాలు పలికించే ప్రయత్నం చేసింది.

ఈ కమర్షియల్ యాడ్ వీడియో షేర్ చేసిన అనసూయ… సావిత్రమ్మ పాత్రలో నటించడం తన అదృష్టం. ఇలాంటి పాత్రలో నటించే అవకావం చాలా అరుదుగా లభిస్తుందని వెల్లడించారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది.. ఈ వీడియోపై అభిమానుల నుంచి ఫన్నీ రియాక్షన్స్ వ్యక్తం అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి జిఫ్ ఇమేజ్‌తో పోస్ట్ చేసిన ఓ కామెంట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనసూయను సావిత్రి పాత్రలో చూసి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో..

మరికొందరు బాలయ్య జిఫ్ ఇమేజ్‌తో కేక పెట్టించే రియాక్షన్స్ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి అనసూయ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్న తీరు నవ్వులు పూయిస్తోంది.