అరవింద సమేతలో అమితాబ్ బచ్చన్.. సీక్రెట్‌గా షూటింగ్

343

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.అక్టోబర్ 11న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో ఇషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు, సునీల్, రావు రమేష్, రవి ప్రకాశ్, సితారా తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్‌పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీ బిజీగా

ఇటీవల విడుదలైన టీజర్‌ ఈ చిత్రంపై మరింత హైప్‌ను పెంచింది.అరవింద సమేత సినిమా షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సోమవారం నుంచి సినిమా ప్రమోషన్‌ను జోరుగా ప్రారంభించాలని నిర్ణయించారు అని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లను, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటి మీడియాకు వెల్లడించనున్నట్టు సమాచారం.

 

aravinda sametha amitabh bachchan కోసం చిత్ర ఫలితంతాజాగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారనే వార్త వెలుగు చూసిందిఅరవింద సమేతలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రంలో అతిథి పాత్రలో బిగ్‌బీ కనిపించనున్నట్టు తెలిసింది. అయితే పాత్రకు సంబంధించిన వివరాలను చాలా సీక్రెట్‌గా పెట్టినట్టు సమాచారం.