రవితేజ‘అమర్ అక్భర్ ఆంటోనీ’ ఫస్ట్ లుక్ విడుదల..3 గెటప్స్ అదుర్స్..

399

రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం ‘అమర్ అక్భర్ ఆంటోనీ’. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ మూవీలో కీలక పాత్రల్లో ఒకప్పటి హీరోయిన్ లయ, సునీల్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కనిపించబోతున్నారు.శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ‘మైత్రి మూవీ మేకర్స్’ నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.సంగీతం: ఎస్ఎస్ థమన్.

శ్రీను వైట్ల, రవితేజ కెరీర్లోనే డిఫరెంట్ మూవీ

ఈ మూవీలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూడు పాత్రలకు సంబంధించిన లుక్ రివీల్ చేస్తూ సోమవారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే రవితేజ మరోసారి తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నాడని స్పష్టమవుతోంది. మాస్ మహరాజ్ తన కెరీర్లో తొలిసారిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుండటం మరో విశేషం.

కీలక పాత్రల్లో లయ, సునీల్

 

రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో గతంలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఆ చిత్రాలకు భిన్నంగా పూర్తిగా డిఫరెంట్ కథ, కొత్త జోనర్లో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ డిఫరెంట్ గెటప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచాయి.