సిగరెట్ తాగుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన అమలా పాల్, నెటిజన్ల ఫైర్

266

ఎదుటి వారికి చెప్పడానికే నీతులు అన్నారో రచయిత. అది అక్షరాలా సత్యం. నిషిద్ధం కాకపోయినా, ఆరోగ్యానికి హానికరమైన మద్యం సేవించడం, పొగ తాగడం వంటి చర్యలు మంచి అలవాట్లు కాదని సెలబ్రిటీలు చెబుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు అలా నటించి మరీ చూపిస్తుంటారు.సినీ స్టార్లు పొగతాగుతున్న పోస్టర్లు, ఫోటోలు ఈ మధ్య వివాదాలకు కేంద్ర బింధువులుగా మారుతున్నాయి.

Image result for hansika cigarette post

గతంలో విజయ్ స్మోకింగ్ చేస్తూ ‘సర్కార్’ పోస్టర్ మీద దర్శనమివ్వగా విషయం కోర్టు వరకు వెళ్లింది.ఇటీవల నటి హన్సిక మహా చిత్రంలో కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో సిగరెట్‌ పట్టుకుని నోటి నుంచి పొగను సుడులు సుడులుగా వదులుతన్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలై వివాదానికి దారి తీసింది. ఆ పోస్టర్‌ విషయంలో హన్సికపై కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. ఆ వివాదం సమసిపోకముందే ఇప్పుడు నటి అమలాపాల్‌ మరో వివాదానికి తెర లేపింది.

a person holding a dog

దమ్మారో దమ్‌ అంటూ పొగ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.ఫోటో షేర్ చేయడం కూడా వివాదస్పదం అయింది. ఈ ఫోటో ద్వారా అమలా పాల్ ఒక దురలవాటును ప్రమోట్ చేస్తుందంటూ నెటిజన్లు మండి పడ్డారు. అయితే తాను స్మోకింగ్‌ను ప్రమోట్ చేయడం లేదని, స్టైలిష్ ఫోటో షూట్లో భాగంగానే ఇలా సిగరెట్ పట్టుకుని ఫోజు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.