రాజకీయాలలోకి వస్తున్న అమలాపాల్ ?

318

హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.ఇక్కడ ఆమె నటించిన పలు సినిమాలు మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాయి.అయితే ద‌ర్శ‌కుడు విజ‌య్‌ ను పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరం అయ్యింది.కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్న త‌ర్వాతి నుంచి హీరోయిన్ అమ‌లాపాల్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Related image

త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆమె ప‌లు సినిమాలు చేస్తోంది. త‌మిళం ఆమె న‌టించిన `రాక్ష‌స‌న్‌` సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఆమె రాజకీయాల గురించి ఆస‌క్తిక‌రంగా మాట్లాడింది.`రాజ‌కీయాల్లోకి వ‌స్తారా? అంటూ న‌న్ను చాలా మంది అడుగుతున్నారు. ఏమో, ఇప్పుడే ఏమీ చెప్ప‌లేను. చూద్దాం.. స‌మయం వ‌స్తే ఏమైనా జర‌గొచ్చు. నన్ను ప‌లు రకాలుగా ఇబ్బందుల‌కు గురి చేసిన వ్య‌క్తి గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించా.

Image result for amala paul

నా చేతికి గాయ‌లైన‌పుడు కూడా కేర‌ళ వ‌రద బాధితుల కోసం స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా. ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయ‌డానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాన`ని అమ‌ల చెప్పింది.దీనిని బట్టి చూస్తే అమ్మడు త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేసేలా ఉంది.