సైరా నరసింహ రెడ్డి సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర…చేస్తుంది ఎవరో తెలుసా..

316

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాంచరణ్ నిర్మిస్తున్నారు.

Image result for saira narasimha reddy

అయితే ఈ పిరియాడికల్ మూవీలో తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా కనిపించబోతోందట.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణానంతరం ఆయన స్ఫూర్తితో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన వీరులలో అల్లూరి సీతారామరాజు ఒకరు. కాబట్టి ఈ పాత్ర కూడా సినిమాకు కీలకమేనని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం.

 

 

అల్లూరి సీతారామరాజు వంటి పవర్‌ఫుల్ పాత్రకు చిరు అయితే సరిగ్గా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయనతోనే ఈ పాత్రను కూడా చేయించబోతోందని ఫిలింనగర్ టాక్. ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.