భార్య అందాన్ని పొగుడుతూ బన్నీ చేసిన పోస్ట్ వైరల్…

444

టాలీవుడ్‌లో స్టైలిష్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్న వాడు అల్లు అర్జున్‌.ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు.ఇక ముఖ్య విషయానికి వస్తే టాలీవుడ్‌లో స్టైలిష్‌ జంటల్లో అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల పేర్లు ముందు వరుసలో ఉంటాయి.అప్పుడప్పుడు వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.

 

ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బన్నీ తన భార్య గురించి చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.ఓ మై గాడ్‌ నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇంత అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా’అంటూ భార్య స్నేహారెడ్డి అందంపై బన్నీ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. గోదుమ రంగులో ఉన్న సల్వార్‌ కమీజ్‌ను ధరించిన తన భార్యను ప్రముఖ స్టైలిస్ట్‌ హర్మన్‌ కౌర్‌ చాలా అందంగా ముస్తాబు చేశారని అల్లు అర్జున్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

కుటుంబంలో ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఫొటోలు షేర్‌ చేసే బన్నీ తాజాగా భార్య అందాన్ని పొగుడుతూ పోస్ట్‌ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బన్నీ పోస్టుకు భారీగా లైక్స్‌, కామెంట్లు వస్తున్నాయి.