అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ ఫస్ట్ లుక్..వెరీ క్యూట్ పోస్టర్..

258

మెగా హీరోల్లో ఎవరికైనా అదృష్టం బాగాలేదంటే అది అల్లు శిరీష్ కే అని చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసిన మిగతా మెగా హీరోలలాగా పెద్ద పెద్ద హిట్స్ కొట్టలేకపోతున్నాడు. అందుకే ఈసారి ఒక వినూత్న కథతో మన ముందు వస్తున్నాడు.

Related image

అల్లు శిరీష్ ఈ సారి ‘ఎబిసిడి’ అంటూ రాబోతున్నాడు. ఎబిసిడి అనేది మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎబిసిడి.. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి దర్శత్వం వహిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని ఈ చిత్రానికి నిర్మాతలు.జుడా శాండీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశాడు. అల్లు శిరీష్ లుక్ కూల్ గా ఉంటూ ఆకట్టుకుంటోంది.మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంలో అల్లు శిరీష్ కు తండ్రిగా నటిస్తున్నాడు.ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అల్లు శిరీష్ ప్రకటించాడు.చూడాలి మరి ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడో లేదో.