పవన్ కు వెన్నుపోటు పొడిచిన అల్లు అర్జున్.. వైసిపి తరపున ప్రచారం

279

ఏపీలో ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది మరి కొద్ది గంటల్లో రాజకీయ పార్టీల మైకులు మౌనం వహించనున్నాయి. ఇక ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపధ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కు మెగా హీరో బిగ్ షాక్ ఇచ్చారు. మెగా హీరో ఇచ్చిన షాక్ పై ఇప్పుడు.. మెగా ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు..జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సైతం ఇదే అంశం పై చ‌ర్చ మొద‌లు పెట్టారు. మెగా ఫ్యామిలీ నుండి కొద్ది రోజుల క్రితం చిరంజీవి త‌న‌యుడు రాం చ‌ర‌ణ్ బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ను త‌న మ‌ద్ద‌తు ఎప్పు డూ ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

ఈ క్రింది వీడియో చూడండి

జ‌న‌సేన హీరోల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన రెండు రోజుల‌కే మెగా హీరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నంద్యాల నుండి పోటీ చేస్తున్న శిల్పా ర‌వి చంద్రా రెడ్డికి మెగా హీరో అల్లు అర్జున్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నంద్యాల శాసనసభ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి బెస్ట్‌ విషెస్‌ తెలుపుతూ శనివారం బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖను ఉంచారు. ‘నా మిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు. అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరు అయినప్పటికీ.. నేను నా స్నేహితుని నూతన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాన్నాను అని బన్నీ పేర్కొన్నారు.

Image result for allu arjun speech

శిల్పా మోహ‌న్ రెడ్డి కుమారుడు అయిన శిల్పా ర‌వి చంద్రారెడ్డి వైసిపి నుండి నంద్యాల ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్నారు. జ‌న‌సేన నుండి ఎస్పీవై రెడ్డి కుటుంబం నుంచి శ్రీధ‌ర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక‌, అక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్ది పోటీలో ఉన్నా..అల్లు అర్జున్ ఓపెన్ గా వైసిపి అభ్య‌ర్దిగా ఉన్న ర‌వికి ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టం ద్వారా ఇప్పుడు జ‌న‌సేన లో టెన్ష‌న్ మొద‌లైంది. బన్నీ ఇచ్చిన ట్విస్ట్ కు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి, మరో పక్క మెగా హీరో నాగబాబు నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో దిగారు ఆయన కోసం ఇప్పటికే తనయుడు వరుణ్ తేజ్ , కుమార్తె నిహారిక ప్రచారం కూడా చేస్తున్నారు, మరో వైపు అల్లుఅర్జున్ కూడా ప్రచారం నాగబాబుకి చేసేందుకు సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది మరో 36 గంట్లలో ప్రచారం కూడా ముగిసిపోనుంది. మరి చూడాలి ఈ ఎన్నికల్లో ఎవరి సపోర్ట్ తో ఎవరు పెద్ద ఎత్తున గెలుపు సాధిస్తారో.