పొలిటికల్ లీడర్ గా ఎంట్రీ ఇవ్వనున్న బన్నీ?

453

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త ఫిలింనగర్‌లో చెక్కర్లు కొడుతోంది.బన్నీ జనసేన తరుఫున పోటీ చేస్తాడా లేదంటే వేరే పార్టీ తరుఫున పోటీ చేస్తాడా? అని ఆలోచిస్తున్నారా?పొలిటికల్ ఎంట్రీ రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. బన్నీ ఇటీవల చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత ఇంతవరకు మరే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళలేదు.

ప్రస్తుతం బన్నీ కథలు వినే పనిలో ఉన్నాడని సమాచారం. తాజాగా ఓ కథ బన్నీని ఆకట్టుకుందట. దీనికి ఓకే చెప్పేసినట్టే అని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంతోష్ రెడ్డి అనే నూతన డైరెక్టర్ ఓ కథను వినిపించారట. అది పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథగా తెలుస్తోంది.

ఇటీవల పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉండటం, అలాగే సంతోష్ చెప్పిన కథ ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో బన్నీ దీనికి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. అంతా ఓకే అయితే బన్నీ సినిమా త్వరలోనే పట్టాలపైకి వస్తుందని ఫిలింనగర్ టాక్.అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.చూడాలి మరి ఈ సినిమా గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో.