క్రేజీ న్యూస్..బాలీవుడ్ లోకి అల్లుఅర్జున్.. క్రికెటర్ పాత్రలో అల్లు అర్జున్.

374

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా కొత్త సినిమా పనుల్లో ఉన్నాడు. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఈ సారి ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. అందుకే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో బన్నీ చిత్రం ఉంటుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ తరుణంలో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తిక్రమైన ప్రచారం జరుగుతోంది.

alluarjun krishnamachari srikanth కోసం చిత్ర ఫలితం

అల్లు అర్జున్ ఒక క్రికెటర్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఇది బన్నీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం అని కూడా పేర్కొంది.బాలీవుడ్ లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతోంది. భజరంగి భాయిజాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.ఈ చిత్రంలో మరో లెజెండరీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం బన్నీని సంప్రదించినట్లు తెలుస్తోంది.

alluarjun krishnamachari srikanth కోసం చిత్ర ఫలితం

1983 లో కపిల్ దేవ్ సారధ్యంలో ఇండియన్ క్రికెట్ టీం తొలిసారి ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ ప్రపంచ కప్ లో కపిల్ దేవ్, కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా, శ్రీకాంత్ పాత్రకు బన్నీ అయితే బావుంటుందని భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని 83 అనే టైటిల్ తో తెరకెక్కించబోతున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు బన్నీ కూడా ఎంట్రీ ఇస్తుండడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.