అన్నయ్య ఏమో తమ్ముడికి గిఫ్ట్ ఇస్తే, తమ్ముడేమో అభిమానికి గిఫ్ట్ ఇచ్చాడు..అల్లు సోదరుల వినూత్న గిఫ్ట్ లు..

315

అల్లు సోదరుల మధ్య ఎంత మంచి రిలేషన్ ఉందొ మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.అయితే వీరి బంధం ఎంత స్ట్రాంగ్ చెప్పడానికి ఇప్పుడు మరొక సంఘటన జరిగింది. అల్లు అర్జున్ శిరీష్‌కు కొత్త యాపిల్ మాక్‌ ల్యాప్‌టాప్ గిఫ్టుగా ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శిరీస్ ఓ ట్వీట్ పెట్టాడు.

20 సంవత్సరాల నుండి విండోస్ వాడుతున్నాను. ఇపుడు మాక్ ఓఎస్‌కు మూవ్ అవుతున్నాను. నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిన అన్నయ్య అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు. అన్నయ్య నాకు చిన్నతనంలో బెన్‌క్యూ జాయ్ బుక్ నుండి ఇప్పుడు ఇచ్చిన ల్యాప్ టాప్ వరకు అన్నీ కూడా ఆయన ఇచ్చిన గిఫ్టులే అని శిరీష్ చెప్పుకొచ్చారు.శిరీష్ పెట్టిన ఈ ట్వీట్ మీద ఓ అభిమాని స్పందిస్తూ అన్నా నాకూ ఒక చిన్న ల్యాప్ టాప్ గిఫ్టుగా ఇవ్వొచ్చుకదా. నేను కొనాలి అంటే మరో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ. సాలరీ తక్కువ. నా జాబ్‌లో ల్యాప్ టాప్ యూజ్ ఎక్కువగా ఉంటుంది కానీ నాకు ఇప్పటి వరకు ల్యాప్ టాప్ లేదు. నేను మీకు, బన్నీకి పెద్ద అభిమానిని అని ట్వీట్ చేశాడు.

దీనికి అల్లు శిరీష్ స్పందిస్తూ నువ్వేం బాధపడుకు తమ్ముడూ.నువ్వు సంపాదిస్తూ నీ ఫ్యామిలీకి సపోర్టుగా ఉండు. నాకు కొత్త ల్యాప్ టాప్ వచ్చింది కాబట్టి నా వద్ద ఉన్న సోనీ ల్యాప్ టాప్ నీకు ఇస్తాను. నీ పూర్తి వివరాలు మెయిల్ చేయ్ అని శిరీష్ సూచించాడు.అభిమాని అడిగిన వెంటనే ల్యాప్ టాప్ ఇస్తా అన్నందుకు ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.