కేరళ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్‌కు గౌరవ ఆహ్వానం, ఎందుకో చూడండి..

256

స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్‌కు టాలీవుడ్‌తో పాటు కేరళ రాష్ట్రంలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ సినిమా విడుదలైందంటే తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ సందడి వాతావరణం ఉంటుంది. బన్నీ నటించిన చిత్రాలు మలయాళం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి.

Image result for allu arjun

తెలుగులో ప్లాప్ అయినా సరే మలయాళంలో పెద్ద హిట్ అయినా సినిమాలు ఉన్నాయి. బన్నీకి కేరళలో ఉన్న ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకుని త్వరలో అక్కడ జరుగబోయే పడవ పోటీలకు ఆహ్వానిస్తూ కేరళ ప్రభుత్వంనుంచి ఇన్విటేషన్ అందింది.

 65 ఏళ్ల నుంచి జరుగుతున్న రేస్

నేహ్రు ట్రోఫీ బోట్ రేసుపేరుతో జరిగే ఈ పడవల పోటీ కేరళలో ప్రతి ఏడాది ఓ స్పెషల్ ఎట్రాక్షన్. దాదాపు 65 ఏళ్ల నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. నవంబర్ 10న 66వ బోట్ రేస్ జరుగబోతోంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పిలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్న స్టైలిష్ స్టార్… మిస్సవ్వకుండా ఆ వేడుకకు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.