పవన్ కల్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ గారు.. ఓకేనా : అల్లు అర్జున్

261

హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారధ్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో శర్వానంద్, సాయి పల్లవిలపై ఉన్న క్రేజ్..సినిమా పై భారీ అంచనాలను తెచ్చిపెట్టింది.

Related image

సోమవారం రాత్రి హైదారాబాద్ శిల్ప కళా వేదికలో నిర్వహించిన ‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ ఫంక్షన్ కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. చీఫ్ గెస్ట్ బన్నీ మాట్లాడుతూ.. దర్శకుడు హను రాఘవపూడి మూవీ అంటే మంచి ప్రేమ కథలు గుర్తొస్తాయని, తనకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టమన్నారు. శర్వానంద్ సాయి పల్లవి యాక్టింగ్ ను మెచ్చుకుంటూ టేక్నీషియన్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలియజేశాడు.ఇక ఏదో ఒకటి అనకుండా మన బన్నీ స్టేజ్ దిగడు కదా. ఈ ఫంక్షన్ లో కూడా తనదైన స్టైల్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు.

‘ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి. హీరో శర్వా నాకంటే చిన్నవాడైనా గారు అని పిలుస్తాను. ఎందుకంటే అతడు తనకుంటూ ఓ స్థానాన్ని మీ మనసులో నిలుపుకున్నాడు. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా అయ్యుండొచ్చు. సమాజంలో మంచి వాళ్లలా ఉండాలంటే గౌరవిస్తూ ముందుకెళదాం. పవన్‌ను పవన్ కల్యాణ్ గారు అని పిలవాలి. కేసీఆర్, చంద్రబాబులాంటి సీఎంలను కూడా ఏకవచనంతో సంబోధిస్తున్నారు ఎవరినైనా సరే గారు అని సంబోధించి విమర్శించడం నేర్చుకోవాలని’ తన స్పీచ్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చారు.