అమీర్ పేట్ లో భారీ మల్టిప్లెక్స్ ను కట్టబోతున్న అల్లుఅర్జున్?

279

ఇటీవలే మహేష్ బాబు ఒక భారీ మల్టిప్లెక్స్ కట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.అత్యాధునిక టెక్నీలజీ, వరల్డ్ క్లాస్ ఇంటీరియర్ డిజైన్స్, విలాసవంతమైన సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించాడు.. మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగిన తర్వాత ఇతర స్టార్స్ కూడా ఈ బిజినెస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Related image

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే హైదరాబాద్‌లో మరో మెగా మల్టీప్లెక్స్ ఏర్పడటం ఖాయం అని తెలుస్తోంది.అమీర్ పెట్ లో ఈ మల్టిప్లెక్స్ కట్టే ఆలోచనలో ఉన్నాడు బన్నీ.ఏసియన్ సినిమాస్‌కు చెందిన సునీల్ నారంగ్‌తో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Related image

అయితే డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటున్నారు. అమీర్‌పేటలో ఒకప్పుడు ఫేమస్ థియేటర్‌గా పేరు గాంచిన సత్యం థియేటర్‌ను పడగొట్టి కొత్తగా మల్టీప్లెక్స్ కడుతున్నారు. అల్లు అర్జున్, ఏసియన్ సినిమాస్ మధ్య డీల్ ఓకే అయితే ఈ స్థానంలోనే వీరి మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు