విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో బన్ని ప్రయోగాత్మక చిత్రం..

378

నా పేరు సూర్య చిత్రం తర్వాత అల్లు అర్జున్ మరే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. దానికి కారణం నా పేరు సూర్య చిత్రం పరాజయం చెందడమే.తర్వాతి చిత్రం విషయంలో పక్కా ప్లాన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాలని బన్నీ భావిస్తున్నాడు. అందుకే తనకు సరిపోయే కథని ఎంచుకోవడంలో ఆలస్యం జరుగుతోంది.

Image result for allu arjun vikram kumar

విక్రమ్ కుమార్ తో బన్ని తర్వాతి చిత్రం ఉంటుందని ఒక వార్త హల్చల్ చేస్తుంది.విక్రమ్ కుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఓ విభిన్నమైన కథని విక్రమ్ కుమార్ బన్నీ వివరించాడట.సెకండ్ హాఫ్ విషయంలో బన్నీ సంతృప్తి చెందక పోవడంతో ఆ చర్చలు అలాగే కొనసాగుతున్నాయి.

Related image

విక్రమ్ కుమార్ వినిపించక కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. విభిన్నమైన కథ కావడంతో బన్నీ వెంటనే ఓకె చెప్పలేక తికమక పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓకె అయితే పునర్జన్మల నేపథ్యంలో బన్నీ చేయబోతున్న తొలి చిత్రం అవుతుంది.ప్రస్తుతం బన్నీ, విక్రమ్ కుమార్ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ సూచించినట్లుగా విక్రమ్ కుమార్ సెకండ్ హాఫ్ లో మార్పులు చేశాడని సమాచారం.ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.