సొంతూరుకు భారీ సాయం ప్రకటించిన అల్లుఅర్జున్

236

అల్లు అర్జున్ ఈ సంక్రాంతి వేడుకలో తన తాత అల్లు రామలింగయ్య సొంతూరు పాలకొల్లులో జరుపుకున్నారు. ఊరిలో ఉన్న తన తాత అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Image result for సొంతూరుకు అల్లు అర్జున్

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ. .చాలా రోజులుగా ఇక్కడికి రావాలనుకున్నా కానీ ఇప్పుడు కుదిరింది. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది.పాలకొల్లు కోసం ఏదైనా చేయాలని ఉందని అన్నారు. ఈ ఊరు తనకు చాలా ఇచ్చిందని అందుకోసమే ఈ ఏడాది సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు.

Image result for allu arjun at palakollu

అందులో భాగంగా కల్యాణ మండపం నిర్మాణానికి రూ.10 లక్షలు సాయం చేశారు. పాలకొల్లు తన కుటుంబానికి చాలా ఇచ్చిందని, అందుకే తనకు చాలా చేయాలని ఉందని అల్లు అర్జున్ తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను పాలకొల్లులో జరుపుకుంటామని ఆయన చెప్పారు.