సైరా లో అల్లు అర్జున్..గోన గన్నారెడ్డి పాత్ర కంటే అధ్బుతమైన పాత్ర..

360

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడని మన అందరికి తెలిసిందే.స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తుంది.అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,నయనతార..లాంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇప్పుడు మరొక క్రేజీ స్టార్ ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆ నటుడు ఎవరో కాదు..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఎలాంటి పాత్రనైనా తన ఎనర్జీతో బన్నీ మరో లెవల్ కు తీసుకుని వెళ్లగల నటుడు. గతంలో రుద్రమదేవి చిత్రంలో బన్నీ గోన గన్నారెడ్డి పాత్రలో విశ్వరూపం ప్రదర్శించాడు. బన్నీ చెప్పే డైలాగులు ఆ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.

ఒకవేళ నిజంగానే సైరా చిత్రంలో బన్నీ కోసం ఓ పాత్ర ఉంటె అల్లు అర్జున్ 100 శాతం తన సత్తా చూపిస్తాడని అనడంలో సందేహం లేదు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో చిరు, బన్నీ ఇద్దరూ కనిపిస్తే మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే ఇంకే కావాలి. ఈ వార్త ప్రచారం జరుగుతున్నప్పటినుంచి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. కానీ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.