అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ కన్ఫార్మ్..జనవరిలో షూటింగ్ స్టార్ట్…

232

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా కొత్త సినిమా పనుల్లో ఉన్నాడు. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఈ సారి ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. అందుకే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో బన్నీ చిత్రం ఉంటుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ అది కుదరలేదు.

Related image

ఇప్పుడు అల్లుఅర్జున్ కొత్త సినిమాను ప్రారంభించాడు.బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైపే మొగ్గుచూపాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా పట్టాలెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు. ఇప్పటికే చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా ప్రకటించనున్నారు.

2019 జనవరిలో చిత్రం ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) వెల్లడించారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలను అందుకోవడంతో ఇప్పుడు ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.