#RRR కోసం ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్..

281

దర్శకదీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా #RRR. బాహుబలి లాంటి ఇంటర్నేషన్ సినిమా తీసిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆయన ప్రెస్టీజ్ ఎక్కడ పోకూడదనే ఉద్దేశంతో చాల జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హీరోలుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను dvv దానయ్య నిర్మిస్తున్నాడు.

Related image

ఈ మధ్యనే సెకండ్ షెడ్యూలు స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా గురించి ఇతర విషయాలు ఒకటి కూడా బయటపడలేదు. ఇటీవల తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని స్పష్టమైంది. ఈ నటుడి పేరు మినహా మిగిలిన పేర్లేమీ బయటకు రాలేదు ఎన్టీఆర్, రాంచరణ్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది.

Related image

మొదట ఈ చిత్రం కోసం కీర్తి సురేష్, సమంత లాంటి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ రాజమౌళి ఖరారు చేయలేదు. ప్రస్తుతం రాజమౌళి చూపు బాలీవుడ్ హీరోయిన్లపై పడ్డట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరోయిన్లతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పరిణితి చోప్రా, సోనాక్షి సిన్హా, అలియా భట్ లతో కూడా రాజమౌళి సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఈ ముగ్గురిలో ఇద్దరినీ ఒకే చేసే అవకాశం ఉంది.