పోసాని కృష్ణ‌ముర‌ళి నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన అలీ అస్సలు న‌మ్మ‌కూడ‌దు

337

పోసాని కృష్ణ మురళి రూపొందిస్తున్న ‘ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు’ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన కమెడియన్ అలీ పోసాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమా టైటిల్స్ పెట్టడంలో పోసాని కృష్ణ మురళి దిట్ట. గతంలో మెంటల్ కృష్ణ అనే సినిమా చేశారు. అందులో ఆయనే హీరో. మెంటల్ కృష్ణ అంటే ఏమిటి? ఆయనకేమైనా పిచ్చి ఉందా? అనే సందేహం అందరిలో కలిగేలా చేశాడు. ఆ తర్వాత ఆపరేషన్ దుర్యోధన, రాజుగారి చేపల చెరువు లాంటి సందేశాత్మక చిత్రాలు చేశారు. ఇపుడు ఈ సినిమా ద్వారా సమాజానికి మరొక సందేశం ఇవ్వబోతున్నారని తెలిపారు.తన కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండటంతో ఏదో ఒకటి చేయాలనే కసితో చెన్నై వచ్చి తన పెన్నును, ఇంకును నమ్ముకుని పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంటుగా కొన్నేళ్లు పని చేసి, పోలీస్ బ్రదర్స్ చిత్రం ద్వారా రచయితగా మారారి పాపులర్ అయ్యాడని అలీ గుర్తు చేసుకున్నారు.

తన టాలెంటుతో పెద్ద హీరోల సినిమాల్లో దక్కించుకుంటూ రైటర్‌ నుంచి దర్శకుడిగా, ఆపై నిర్మాతగా ఎదిగారు. తను నిర్మాతగా సినిమా చేసినపుడు కూడా నేను మీ తోటి కళాకారుడిని కదా.. నేను అంత ఇచ్చుకోలేను, ఇంతకే చేయండి అని ఎప్పుడూ అనలేదు. ఏ ఆర్టిస్ట్ ఎంత తీసుకుంటాడో అంతే ఇచ్చాడు. ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టడం లాంటివి చేయలేదు. సినిమా ప్లాప్ అయినా కూడా తన ప్రాపర్టీ అమ్ముకుని అప్పు తీర్చాడే తప్ప నేను డబ్బు ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అని ఎప్పుడూ చెప్పలేదని అలీ అన్నారు.పోసాని చాలా సైలెంటుగా ఉంటాడు. షూటింగుకు వస్తాడు.. తన పని తాను చేసుకుని వెళ్లిపోతాడు. ఇతర ఆర్టిస్టుల గురించి కానీ, రైటర్ల గురించి కానీ ఈ మాటలు అక్కడ, ఆ మాటలు ఇక్కడ ఎప్పుడూ చెప్పేవాడు కాదు. ఎంతో మందికి సాయం చేశాడు కానీ ఎవరికీ చెప్పుకోడు, ఇవన్నీ నేను స్వయంగా చూశానని అలీ తెలిపారు.

Image result for posani murali

పోసాని అలాంటి మంచి వ్యక్తి కాబట్టే భగవంతుడు తనకు నాయక్ అనే సినిమాతో నటుడిగా బ్రేక్ ఇచ్చాడు. దాని తర్వాత టాప్ కమెడియన్ అయిపోయారు. ఇంత మంది కమెడియన్లో అతడు ఏ స్థానంలో ఉన్నారనే విషయం పక్కన పెడితే హ్యూమన్ బీయింగ్‌గా తను జెంటిల్మెన్. ‘ముఖ్యమంత్రి గారు మీరు మాటిచ్చారు’ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలకు, నటించిన ఆర్టిస్టులకు ఆల్ ది బెస్ట్. పోసాని కృష్ణ మురళి మరో విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్లు అలీ తెలిపారు. ఇక ఇప్పుడు వీరు ఇద్ద‌రూ కూడా వైసీపీలోఉన్న విష‌యం తెలిసిందే ఎన్నిక‌ల క్యాంపెయినింగ్ లోకూడా బీజీగాఉన్నారు ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ న‌టులు. మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.