నేనేం చేయలేదు సార్…అమాయకంగా చెప్తున్న సమంతా..!

367

అక్కినేని వారింటి కోడలు సమంతా పెళ్ళయిన తరువాత మంచి జోష్ మీద ఉంది..పెళ్లి తరువాత ఆమె నటించిన సినిమాలు ఘన విజయాలుగా నిలుస్తున్నాయి..తాజాగా ఆమె క‌న్న‌డ ‘యుట‌ర్న్’ మూవీ రీమేక్‌లో లీడ్ రోల్‌లో న‌టిస్తుంది.ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ‘నేను ఈ రకంగా బార్ కౌంటర్‌లో ఇన్ని శబ్దాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా.. నిజమా..? అబద్ధమా..?’ అంటూ సమంత చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది…

ఓ హత్య కేసులో సమంతను పోలీసులు అనుమానించడంతో ‘నేనేం చేయలేదు సార్..’ అంటూ ఇన్నోసెంట్ గా చెబుతూ కనిపించింది. సస్పెన్స్ త్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.సెప్టెంబ‌ర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.కన్నడ యూటర్న్ ఒరిజినల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా త‌న‌కు త‌ప్ప‌కుండా మ‌రో విజ‌యం అందిస్తుందని స‌మంత ధీమా వ్య‌క్తం చేసింది.