అమెరికాలో అక్కినేని ఫామిలీ ఎంజాయ్..విజయంతో వచ్చిన సంతోషము

246

విజయం దక్కింది ఇక ఎంజాయ్ చెయ్యడమే ఆలస్యం అనుకున్నారేమో ఫామిలీ మొత్తం అమెరికాలో చేరిపోయారు.ఎవరి గురించి అనుకుంటున్నారా. ఇంకెవరి గురించి అక్కినేని ఫామిలీ గురించి.ఇటీవలే ‘శైలజా రెడ్డి అల్లుడు’ రూపంలో నాగచైతన్య, ‘యూ టర్న్’ రూపంలో సమంత మంచి హిట్స్ తమ ఖాతాలో వేసుకోగా.. తాజాగా ‘దేవదాస్’ రూపంలో నాగ్ విక్టరీ సాధించాడు.అందుకే ఈ సంతోషంకు మరింత ఆనందాన్ని కలిగించాలని అందరు అమెరికాకు చెక్కేశారు.

Image result for akkineni nagarjuna family
అక్కినేని ఫ్యామిలీ అంతా ప్రస్తుతం విదేశాల్లో చక్కర్లు కొడుతూ హాలీడే మూడ్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.వారం కిందటనే అమెరికా వెళ్లారు చైతన్య సమంత.వీళ్ళ హాలీడే పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెతిసిందే. అయితే తాజాగా ఆ ఇద్దరితో నాగార్జున, అమల, అఖిల్ కూడా చేరిపోయారు. కుటుంబమంతా కలిసి ఎంతో ఆనందంగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఆ పిక్స్ సోషల్ మీడియాలో పెట్టేశారు నాగ్. ఈ మేరకు నాగార్జున ట్వీట్ చేస్తూ.. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో హాలీడే ట్రిప్స్ చాలా ఆనందాన్నిస్తోంది. దానికి సక్సెస్ కూడా యాడ్ అయితే అది మరింత ఆనందం’’ అని పేర్కొన్నాడు. నాగ్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూన్నారు.