బిగ్‌బాస్‌ నాగార్జున రెమ్యునరేషన్ తెలిస్తే షాకవుతారు ఎన్టీఆర్ నాని రికార్డులు బ్రేక్

416

బిగ్ బ్రదర్ షో నుంచి మన ఇండియాలో బిగ్ బాస్ రియాల్టీ షో వచ్చింది, అయితే కంటెస్టెంట్స్ తో హౌస్ లో బయట ప్రపంచానికి సంబంధం లేకుండా జీవించడం అంటే నిజంగా ఇది ఓ దీవిలో వదిలితే ఎలా ఉంటుందో అలా అని చెప్పాలి. కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆల్‌టైం నెంబర్‌ వన్ షోగా బిగ్‌బాస్ షో నిలిచింది.. చాలా పాపులర్ అయ్యింది. దేశంలోనే ది బిగ్గెస్ట్ షోగా మంచి రేటింగ్‌ను సంపాదించుకుంది. ఊహకి అందని విధంగా బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్‌లతో హౌస్‌మెంట్స్ ఎలా ప్రవర్తిస్తారు..? ఫొన్‌ లేకుండా.. టీవీ లేకుండా.. ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా.. కేవలం హౌస్‌లోని సభ్యులతోనే.. వారు ఏవిధంగా ఉంటారు..? అత్యవసర సమయాల్లో వారు ఎలా ప్రవర్తిస్తారు..? అనేది బిగ్‌బాస్ షో ప్రధాన అంశం. అయితే 100 రోజులు పూర్తి చేసుకుని తెలుగులో మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

Image result for big boss nagarjuna

ఇదంతా బాగానే ఉన్నా.. హౌస్‌మెంట్స్‌కి బయట జరిగే విషయాలను.. వారు చేసే తప్పులను చూపిస్తూ.. వారిని సరైనదారిలో పెట్టేందుకు ఓ పవర్ ఫుల్ వ్యక్తి కావాలి. అలా ఇప్పటికే.. మీలో ఎవరు కోటీశ్వరుడు తో కింగ్ నాగ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక వివాదాస్పద రియాల్టీ షో బిగ్‌బాస్‌కు కూడా హోస్ట్‌గా తన దైన స్టైల్లో.. షోని నడిపించి ఔరా అనిపించారు. అయితే.. ఇంత పెద్ద యాక్టర్.. సినిమాలను, మిగతా పనులను పక్కన పెట్టి.. కేవలం బిగ్‌బాస్ షో మీదనే 100 రోజులు ఫోకస్ చేయడం మాములు విషయమా..? మరి ఇందుకు గాను.. కింగ్ నాగ్ ఈ షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది కదా..! మరి ఆయన ఎంత తీసుకున్నారో తెలుసా.. రూ.5 కోట్లు. అవును మీరు విన్నది నిజమే.. అక్షరాల ఐదు కోట్లు తీసుకున్నారు నాగార్జున. మరి నాగార్జున రెమ్యునరేషన్ మాత్రమే, మరి బిగ్ బాస్ సెట్ వంద రోజులు అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు దానికి మరెన్ని కోట్ల రూపాయలు తీసుకుంటారో అర్దం చేసుకోండి, అయితే నాగార్జున సినిమాలతో పాటు వ్యాపారాలతో బిజీ అందుకే ఆయన డిమాండ్ చేసిన 5 కోట్ల రూపాయలు బిగ్ బాస్ టీం ఆయనకు ఇస్తామని ఒప్పందం చేసుకుందట.

ఈ క్రింద వీడియో చూడండి

బిగ్‌బాస్ సీజన్స్ 1,2లు చేసిన ఎన్టీఆర్, నానీల కంటే.. నాగార్జునే అత్యధిక పారితోషికం తీసుకున్నారు. సీజన్ 1 కి 74 రోజులకి ఎన్టీఆర్ 2.5 కోట్లు తీసుకోగా.. నాని 100 రోజులకి 3 కోట్లు తీసుకున్నారు. నాగార్జునకి ఒక ఎపిసోడ్‌కి స్టార్ మా రూ.12 లక్షలు ఇచ్చిందట. ఇలా మొత్తంగా 100 రోజులకి 5 కోట్లన్నమాట. అలాగే.. షో స్టార్టింగ్‌లోనే.. ఫుల్ రేటింగ్‌తో దూసుకెళ్లిపోయారు అక్కినేని నాగార్జున. అయితే వారానికి రెండు రోజులు మాత్రమే నాగ్ కనిపిస్తారు కాని ఆయన హౌస్ లో ఏం జరుగుతుంది ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలి, అప్పుడే షో మరింత సక్సస్ అవుతుంది అందుకే నాగ్ ప్రతీ రోజు హౌస్ మేట్స్ ఆట చూసేవారట, మొత్తానికి నాగ్ అత్యధిక పారితోషికంతో బిగ్ బాస్ తెలుగులో రికార్డ్ క్రియేట్ చేశారు అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.