2.ఓ లో కీరవాణి పాడిన పాటకు కింగ్ నాగార్జున ఫిదా..ఏమని ట్వీట్ చేశాడో చూడండి

288

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.ఓ’. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించాడు.. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఆడియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పోయి.

Image result for 2.o

నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 600 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూపొందించింది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకొన్నారు.

అయితే ఈ చిత్రంలోని ‘బుల్లిగువ్వా..’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు.కీరవాణి పాడిన ఈ పాటకు విశేష స్పందన వస్తుంది.ప్రముఖులు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్‌గా ఉందంటూ ప్రశంసించారు.