బిగ్‌బాస్ హౌస్ లోకి నాగార్జున- నాని ఆ కంటెస్టెంట్ కి లైఫ్ కార్డు ఇవ్వ‌నున్న నాగార్జున

442

బిగ్ బాస్ హౌస్ లోకి సెల‌బ్రెటీల తాకిడి ఉండేకొల‌ది పెరుగుతోంది.. ఇప్ప‌టికే ప్ర‌తీ వారం సినిమా విడుద‌లకు ముందు చిత్ర ప్ర‌మోష‌న్స్ కోసం చిత్ర‌యూనిట్లు ఇంటిలోకి రావ‌డం చేస్తున్నారు….ఇంటి స‌భ్యుల‌తో కాసేపు ముచ్చ‌టించి త‌మ సినిమా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు.. ఇప్ప‌టికే స‌ర‌దాగా యాంక‌ర్ ప్ర‌దీప్ హౌస్ లోకి వ‌చ్చారు.. అలాగే లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ కూడా విశ్వ‌రూపం సినిమా ప్ర‌మోష‌న్ కు వ‌చ్చారు.. ఇక గూడ‌ఛారి సినిమా యూనిట్ కూడా బిగ్ బాస్ లోకి ఇటీవ‌లే వ‌చ్చింది… తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి త్వరలోనే అక్కినేని నాగార్జున వెళ్లనున్నాడు.అనే వార్త ఇప్పుడు బుల్లితెర ప్ర‌పంచంలో వైర‌ల్ అవుతోంది.

Related imageబిగ్‌బాస్ హౌస్‌లోకి త్వరలోనే అక్కినేని నాగార్జున వెళ్లనున్నాడు అన‌గానే మీరు ఆలోచించారు క‌దా, నిజ‌మే ఆయ‌న త‌న కొత్త సినిమా ప్ర‌మోష‌న్ కోసం వెళ్ల‌నున్నారు…తన సినిమా ‘దేవదాస్’ ప్రమోషన్ కోసం హౌస్‌లోకి నాగార్జున వెళ్లనున్నాడు అని చిత్ర‌యూనిట్ చెబుతున్నార‌ట‌. జూన్‌ నెలలో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2‌లో ఇప్పటికే చాలా మంది తమ సినిమాలని ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఈ సినిమాని కూడా నాగార్జున ప్ర‌మోట్ చేసుకోవాల‌ని అనుకుంటున్నారు..అంద‌రిలా దేవదాస్ టీమ్‌ కూడా బిగ్‌బాస్‌ షోను వినియోగించుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని.. దేవదాస్‌లో నాగార్జునతో కలిసి నటించిన నేపథ్యంలో.. షో నిర్వహాకులు శని లేదా ఆదివారం ఈ టీమ్‌కి అవకాశం కల్పించాలని చూస్తున్నారు.

Image result for bigboss  2 in nagarjuna entry

బిగ్‌బాస్‌లో మాములు రోజులతో పోలిస్తే శని, ఆదివారం ఎక్కువగా వీవర్‌షిప్ ఉంటుంది… దీన్నే క్యాష్ చేసుకోవాలని ఇప్పుడు దేవదాస్ టీమ్ ఆశిస్తోంది. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. శ్రీరామ్ ఆతిద్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఆకాంక్ష సింగ్, రష్మిక మందాన నటిస్తున్నారు.ఇక శ‌నివారం ఆదివారం హౌస్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఓఅర‌గంట నాని నాగార్జున టీమ్ స‌భ్యుల‌తో మాట్లాడి ఆ త‌ర్వాత త‌న రోజువారి కార్య‌క్ర‌మం న‌డుపుతారు అని తెలుస్తోంది… దీని కోసం స్టార్ మా కూడా రెండు గంట‌ల నిడివి కోసం ఆలోచిస్తోంద‌ట‌.

గంట‌న్న‌ర లో నాగార్జున ఓ అర‌గంట మాత్ర‌మే ఉంటే అవ‌కాశం ఉంద‌ని అందుకే షోను మ‌రో అర‌గంట కొన‌సాగింపు చేస్తారు అని తెలుస్తోంది. ఇక లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాసన్ అమిత్ కు నామినేష‌న్ లో లేకుండా, రెండు వారాలు నామినేష‌న్ లైఫ్ కార్డు ఇచ్చారు.. అలాగే నాగార్జున కూడా త‌న‌కు న‌చ్చిన వారికి లైఫ్ కార్డు ఇచ్చే అవ‌కాశం ఉంది అని అంటున్నారు.. సో చూడాలి బిగ్ బాస్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.