శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని వారి కోడలు..!

460

ప్రముఖ హీరోయిన్ అక్కినేని నాగార్జున కోడలు సమంతా ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు..విఐపి ప్రారంభ దర్శనంలో ఆమె ఏడుకొండల స్వామి సేవలో పాల్గొంది..స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆమె మాట్లాడుతూ తనకు తిరుమల అంటే ఎంతో ఇష్టమని గతంలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా సార్లు రావడం జరిగిందని స్వామివారిని దర్శించుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. సమంత మామగారైన అక్కినేని నాగార్జునకు కూడా ఏడుకొండల స్వామివారంటే తనకు ఎంతో భక్తి అని గతంలో చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అక్కినేని వారి కోడలు కూడా మామగారి బాటలోనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం స్వామిని దర్శించుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పడం విశేషమే. మరో వైపు సమంత తాజా చిత్రం ‘U-టర్న్’ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదొక్కటే కాకుండా తమిళ తెలుగు భాషల్లో పలు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉంది సమంత. అందులో ఒక చిత్రంలో తన హస్బెండ్ నాగ చైతన్యతో కలిసి నటిస్తుండడం విశేషం.