పాపం సమంతను బాగా వాడేస్తున్న అక్కినేని ఫ్యామిలీ..ఏం చేస్తున్నారో తెలుసా?

555

అక్కినేని సమంతా….ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతో మంది కుర్రాలకు డ్రీం గర్ల్.తన నటనతో మంచి మనసుతో ఎంతో మంది కుర్రాలను తన అభిమానులుగా మార్చుకుంది.టాప్ హీరోయిన్ గా ఉండగానే అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.పెళ్లి అయిన కూడా వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఆనందపరుస్తు వరుస హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నది. మహానటి, రంగస్థలం,అభిమన్యుడు లాంటి వరుస హిట్స్ కొట్టింది.అయితే ఇప్పుడు సమంతను అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు బాగా వాడుకుంటున్నారు అని అందరు అనుకుంటున్నారు.అసలెందుకు అలా అనుకుంటున్నారు. కారణం ఏమిటి..ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Image result for akkineni samantha

సమంతకు ఉన్న క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టకముందే ఆమెకు చాలా క్రేజ్ ఉంది.ఒక వైపు ప్రత్యూష ఫౌండేషన్ నడుపుతూ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ సమాజంలో కూడా మంచి పేరే తెచ్చుకుంది.అయితే అక్కినేని కోడలిగా మారినా తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. అయితే స్టార్ హీరోయిన్ అయిన సమంత చైతుని పెళ్లాడటం వల్ల అతని ఇమేజ్ కూడా పెరిగింది.అయితే ఇంత క్రేజ్ ఉన్న సమంతను అక్కినేని హీరోలంత కలిసి తెగ వాడుకుంటున్నారు.సినిమా ఏదైనా హీరో ఎవరైనా అక్కినేని ఫ్యామిలీ మాత్రం సమంతను వాడేయడం కామన్ గా మారింది.

Image result for akkineni samantha

రాజు గారి గది-2 నుండి రాబోతున్న చిలసౌ వరకు అక్కినేని ఫ్యామిలీ సినిమా అంటే చాలు సమంత ప్రమోట్ చేయాల్సిందే.రాజు గారి గది-2 లో సమంత నటించింది కాబట్టి ఆమె ప్రమోట్ చేసిందని చెప్పొచ్చు. కాని చిలసౌ సుశాంత్ కు సపోర్ట్ గా నిలవడం మాత్రం సమంత క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికే అంటున్నారు.తన ఫ్యామిలీ హీరో కాబట్టి సుశాంత్ సినిమాకు అటు చైతు, ఇటు సమంత ఫుల్ ప్రమోట్ చేస్తున్నారు. దర్శకుడు రాహుల్ రవింద్రన్ కూడా తన స్నేహితురాలు చిన్మయి భర్త కావడంతో సమంత ఈ విధంగా కూడా చిలసౌ ప్రమోషన్స్ ను న్యాయం చేస్తుంది.అంతేకాకుండా చైతన్య ప్రస్తుతం నటిస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాకు కూడా చైతన్య సమంతా హెల్ప్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం వచ్చిన సమంతా ఆ సినిమా గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది.ఆ కారణాల వలనే త్వరలో విడుదల అవ్వబోతున్న శైలజా రెడ్డి అల్లుడు మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.మొత్తానికి సమంతను ఈ రేంజ్ లో వాడుకోవడం కొందరు సమంత ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. ఇక ఈమధ్య అమ్మడు సినిమాలు మానేసి ఉత్తమ ఇల్లాలిగా మారాలని చూస్తుంది. అలా చేస్తే సమంత ఫ్యాన్స్ కచ్చితంగా అప్సెట్ అయ్యే అవకాశం ఉంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సమంతను నిజంగానే అక్కినేని ఫ్యామిలీ వాడుకుంటుంది అనుకుంటున్నారా..లేదా అదంతా సమంతా అభిమానుల వెర్రి ఆలోచననా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.