‘దేవదాసు‌’ మనవడు.. ‘మన్మథుడి’కి వారసుడు..అఖిల్ మూడవ సినిమా ఫస్ట్ లుక్ రీలీజ్..

372

యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ మూడో సినిమాకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ ఖరారైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు యూనిట్‌ బుధవారం ప్రకటించింది. దీంతోపాటు వీడియో రూపంలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.ఈ చిత్రంలో ఆయన లవర్‌ బాయ్‌లా కనిపించారు.

Image result for mister majnu

‘‘దేవదాసు‌’ మనవడు.. ‘మన్మథుడి’కి వారసుడు.. కావ్యంలో కాముడు.. అంతకన్నా రసికుడు’ అంటూ పాట రూపంలో సినిమాలో అఖిల్‌ వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్‌.. ఏమిటో ఈ ఇంగ్లిషు భాష.. దేన్నైతే మిస్‌ చేయకూడదో దాన్నే మిస్‌ అన్నారు’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకర్షించేలా ఉంది.

గత చిత్రాలతో పోల్చితే ఇందులో అఖిల్‌ లుక్‌, పాత్ర చాలా విభిన్నంగా ఉన్నాయి. ఈ చిత్రంలో అఖిల్‌ ప్లేబాయ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా మీద హోప్స్ పెట్టుకోవచ్చనే విధంగా ఉన్నాయి.