అఖిల్ నాలుగవ సినిమా ఫిక్స్…వినూత్న దర్శకుడితో పనిచేస్తున్న అకిల్…

410

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అకిల్ ఇప్పటివరకు సరైన హిట్ పొందలేదు.మొదటి సినిమా అకిల్ నిరాశపరచింది.రెండవ సినిమా హలో పరువలేదు అనిపించింది.అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.అఖిల్ ప్రస్తుతం తన మూడో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.తొలి ప్రేమ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు నాల్గవ సినిమా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు.మలుపు చిత్రంతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు సత్య ప్రభాస్ పినిశెట్టి అఖిల్ లో సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖిల్ ని కలసి సత్య ప్రభాస్ ఓస్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. అఖిల్ ఆ కథకు ఒకే చెప్పినట్లు సమాచారం.

సత్య ప్రభాస్ దర్శకత్వం తనకు సరికొత్త ఇమేజ్ తీసుకువస్తుందనేది అఖిల్ ఆలోచన.కథ పూర్తిగా సిద్ధం చేసిన తరువాత అఖిల్ మరోమారు ఈ చిత్రంపై నిర్ణయం తీసుకుని అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల్ తన చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.