మిస్టర్ మజ్ను తొలిపాట విడుదల..

415

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అ‍ట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Akhil Akkineni Mr Majnu First Single Yemainado - Sakshi

త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. తాజాగా తొలి పాటను విడుదల చేశారు.ఏమిటో ఏమిటో అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. లవ్ ట్రాజిడీ సాంగ్ ని తలపించేలా ఈ పాట ఉంది.

హీరో, హీరోయిన్ మధ్య ఎడబాటును వివరిస్తూ పాటల రచయిత శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ వినసొంపుగా ఉంది. అర్మాన్ మాలిక్ ఈ పాటని పాడారు.ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు