క్రేజీ కాంబినేషన్: కొణిదెల బ్యానర్‌లో బోయపాటి దర్శకత్వంలో అక్కినేని అఖిల్..

307

అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమాలోకి వచ్చాడు.అఖిల్ నటించిన మొదటి రెండు చిత్రాలు నిరాశపరచడంతో ప్రస్తుతం ఈ యువ హీరో దృష్టి మొత్తం మజ్ను చిత్రంపై ఉంది. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా అఖిల్ తదుపరి చిత్రాలపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

Related image

కొణిదెల బ్యానర్ లో అఖిల్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడానికి కారణం మెగా పవర్ స్టార్ రాంచరణ్ అని వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రానికి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శత్వం వహిస్తాడని న్యూస్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడా లేక కేవలం సమర్పకుడిగా మాత్రమే ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.

పెద్ద అన్నయ్య

ఆసక్తి రేపుతున్న ఈ మెగా, అక్కినేని కాంబినేషన్ కు ఎప్పుడు అంకురార్పణ జరుగుతుందో చూడాలి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం.మెగా, అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి, నాగార్జున మంచి స్నేహితులు కూడా. ఈ బంధమే తాజాగా వస్తున్న వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.