ఖాకి డైరక్ట‌ర్ తో అజిత్ కొత్త ప్రాజెక్ట్

355

త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌న సిన‌మాల జోరు పెంచారు.. ఆయ‌న ప్ర‌స్తుతం విశ్వాసం అనే సినిమాని చేస్తున్నారు..ఆయన యాక్ష‌న్ సినిమాల మార్క్ ద‌ర్శ‌కుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బిజీగా ఉన్నాడు…ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది…. ఈ మూవీకి సంబంధించి చాలా వ‌రకూ షూటింగ్ హైద‌రాబాద్ లోనే పూర్తి అయింది… ఇక ఆయ‌న స‌ర‌స‌న ఈ చిత్రంలో న‌య‌న‌తార న‌టిస్తున్నారు.

Image result for ajith

ఇక అజిత్ త్వ‌ర‌లో మ‌రో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు అని తెలుస్తోంది.. యువ డైరెక్ట‌ర్ వినోత్ ద‌ర్శ‌క‌త్వంలో అజిత్ సినిమా రాబోతోంది.. ఈ ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే కార్తీ – ర‌కుల్ జంట‌గా వ‌చ్చిన తీరం అడిగారా ఒండ్రు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు… ఈ సినిమానే తెలుగులో ఖాకీగా వ‌చ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమా స్టోరీ లైన్ అంద‌రికి న‌చ్చింది.. ఇక ఈ సినిమా విజ‌యంతో ఈ ద‌ర్శ‌కుడి పై న‌మ్మ‌కాలు మ‌రింత పెరిగాయి కోలీవుడ్ లో.

Image result for vinoth director

 

ఇక తాజాగా వినోత్ అజిత్ ను క‌లిసి ఓ క‌థ చెప్పార‌ట‌.. దీంతో ఈ స్టోరీ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేసేందుకు అజిత్ ఒకే చెప్పార‌ని తెలుస్తోంది.. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న విశ్వాసం షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు.