#RRR లో కీలకపాత్రలో అజయ్ దేవగన్?

256

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.

Image result for #rrr

రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది.విలన్ పాత్రలో కన్నడ హీరో యశ్ పేరు వినిపిస్తోంది.అయితే ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం రాజమౌళి పెద్ద స్టార్స్ ని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related image

ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర కోసం రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పేరు పరిశీలిస్తున్నాడట. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ పాత్ర అజయ్ దేవగన్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. రాజమౌళి ఇప్పటికే అజయ్ దేవగన్ ని సంప్రదించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ పాత్ర విషయం మీద అజయ్ దేవగన్ ఇంకా స్పందించలేదు.ఈ వార్త గురించి అధికారిక ప్రకటన విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.