అఖిల్‌తో సుకుమార్ సినిమా…కథ సిద్దం..

398

అక్కినేని అఖిల్ మంచి జోష్ లో ఉన్నాడు.ప్ర‌స్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.డిసెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత అఖిల్ స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టితో సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వచ్చిన విష‌యం తెలిసిందే.

తాజాగా అఖిల్ గురించి మరో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే… అఖిల్ హీరోగా సుకుమార్ ఓ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధమవుతోందట. అయితే ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించడంలేదట.సుకుమార్ కథతో అతని అసిస్టెంట్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేప్టటే అవకాశముందని తెలుస్తోంది.

ఆల్రెడీ సుకుమార్ ఓ స్టోరీ లైన్‌ని నాగ్‌కి చెప్పాడట. అఖిల్ కూడా ఈ కథ విన్నాడట. నాగ్, అఖిల్ ఇద్దరూ ఈ స్టోరీ లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుకుమార్ బ్యానర్లో సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాకి సుకుమార్‌తో పాటు నాగార్జున‌ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారట.ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.